1. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు భారతీయ రైల్వే అనేక కొత్త సర్వీసులు ప్రారంభిస్తోంది. ఇటీవల ఐఆర్సీటీసీ (IRCTC) భాగస్వామ్యంతో కేటరింగ్ సేవలు ప్రారంభించగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు మరో కొత్త సేవలు ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. సాధారణంగా విమాన ప్రయాణికులకు మాత్రమే పరిచయం ఉన్న ఎయిర్ హోస్టెస్ (Air Hostess) సేవలను రైలు ప్రయాణికులకు కూడా అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అంటే, విమానాల్లో ఉన్న విధంగానే రైళ్లలో కూడా రైల్ హోస్టెస్ ప్రయాణికులకు సర్వీసులు అందిస్తారు. ప్రయాణికులు రైలు ఎక్కగానే వారిని స్వాగతిస్తారు. ఆ తర్వాత వారికి జాగ్రత్తలు చెప్పడం నుంచి వారికి కావాల్సిన భోజనాల వరకు అన్నీ వారే చూసుకుంటారు. అయితే ఈ సేవలను అన్ని రైళ్లలో కాకుండా తొలుత ప్రీమియం రైళ్లలోనే ప్రారంభించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. కాగా, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశంలో తయారైన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్లో ఇప్పటికే మహిళా రైల్ హోస్టెస్లను నియమించారు. త్వరలో అన్ని ప్రీమియం రైళ్లలో హోస్టెస్లను నియమించనున్నారు. కేవలం పగటి వేళల్లో మాత్రమే రైళ్లల్లో హోస్టెస్ సేవలు అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. శతాబ్ది, గతిమాన్, తేజస్, వందే భారత్ సహా కనీసం 25 ప్రీమియం రైళ్లలో ప్రయాణికులను స్వాగతించడానికి మహిళా సిబ్బందిని నియమించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఈ హోస్టెస్లు పగటిపూట మాత్రమే పని చేస్తారు. అందువల్ల రాత్రి ప్రయాణించే రాజధాని, దురంతో వంటి ప్రీమియం రైళ్లలో మహిళా సిబ్బంది ఉండరని రైల్వే శాఖ స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ కొత్త రకం సేవలపై ఐఆర్సీటీసీ అధికారి మాట్లాడుతూ, “ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి రైల్ హోస్టెస్లను నియమించాలని నిర్ణయించాం. విమానాల్లో ఎయిస్ హోస్టెస్ మాదిరిగానే రైళ్లలోనూ మహిళా సిబ్బంది సేవలు అందిస్తారు. మరోవైపు, రైలు ప్రయాణంలో ప్రయాణీకుల ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరిస్తారు.” అని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)