1. భారతీయ రైల్వే (Indian Railways) వేసవిలో చల్లని కబురు చెప్పింది. రైల్వే ప్రయాణికులకు తక్కువ ధరకే ఏసీ ప్రయాణాన్ని అందించబోతోంది. ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరల్ని బుధవారం నుంచి తగ్గిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ప్రయాణికులకు బ్లాంకెట్లను కూడా అందించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైల్వే ప్రయాణికులకు అత్యుత్తమ, చౌకైన ఏసీ ప్రయాణం అందించడానికి భారతీయ రైల్వే త్రీ టైర్ ఎకానమీ కోచ్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇతర రైళ్లల్లో సాధారణ ఏసీ 3 టైర్ కోచ్‌ల కన్నా 3 టైర్ ఎకానమీ కోచ్‌లల్లో ఛార్జీలు 6-7 శాతం తక్కువగా ఉంటాయి. 3 టైర్ ఎకానమీ కోచ్‌లల్లో ఛార్జీలను తగ్గిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. గత సంవత్సరం జారీ చేసిన సర్క్యులర్ ద్వారా AC-3 టైర్ టికెట్ ధరతో సమానంగా 3-టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరను చేసిన సంగతి తెలిసిందే. కానీ రైల్వే ప్రయాణికులకు తక్కువ ఛార్జీతో ఏసీ ప్రయాణాన్ని అందించడమే 3-టైర్ ఎకానమీ క్లాస్ లక్ష్యం. అందుకే ధరల్ని తగ్గిస్తున్నట్టు తాజాగా రైల్వే ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. భారతీయ రైల్వే 2021 సెప్టెంబర్‌లో ఏసీ 3 టైర్ ఎకానమీ బోగీలను ప్రవేశపెట్టింది. ఈ బెర్త్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు బ్లాంకెట్లను ఇచ్చేది కాదు. ఇప్పుడు ఛార్జీలు తగ్గించడంతో పాటు బ్లాంకెట్స్ కూడా ఇవ్వాలని రైల్వే నిర్ణయించింది. అంటే థర్డ్ ఏసీ ప్రయాణికులకు లభిస్తున్నట్టే సదుపాయాలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)