అయితే ఎంపిక చేసిన కొన్ని టర్మ్ డిపాజిట్లకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. ముఖ్యంగా ఏడాది నుంచి మూడేళ్ల కాలపరిమితి ఉన్న టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.75 శాతానికి పెరిగింది. గతంలో ఇది 6.25 శాతంగా ఉంది. పెరిగిన వడ్డీ రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయని పీఎన్బీ వెల్లడించింది. వివిధ కాలపరిమితులతో రూ.2 కోట్లలోపు చేసిన టర్మ్ డిపాజిట్లపై పీఎన్బీ తాజా వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
* 91- 179 టెన్యూర్‌కి 4.50 శాతం : 7 రోజుల నుంచి 14 రోజుల కాలపరిమితి ఎఫ్డీలపై సాధారణ ప్రజలకు 3.50 శాతం వడ్డీని పీఎన్బీ ఆఫర్ చేస్తోంది. 15 రోజుల నుంచి 29 రోజులు, 30 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్డీలపై కూడా 3.50 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 46 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్డీలు, 91 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్డీలపై 4.50 శాతం వడ్డీని తాజాగా అందిస్తోంది.
పైన పేర్కొన్న వివిధ కాలపరిమితి ఎఫ్డీలపై సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా 0.50 వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తుంది. ప్రీ మెచ్యూర్ విత్ డ్రాయల్ ఆప్షన్ లేకుండా PNB ఉత్తమ్ స్కీమ్‌లో, వడ్డీ రేటు 6.30 శాతం నుంచి 6.80 శాతానికి పెరిగింది. సవరించిన వడ్డీ రేట్లతో పాటు, 666 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్‌కు సంవత్సరానికి 8.1 ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను బ్యాంక్ అందిస్తోంది.