1. పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా కొంతకాలంపాటు నిషేధం విధించడం, ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కారణంగా భారతదేశంలో వంట నూనెల ధరలు (Cooking Oil Prices) పెరిగిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం, పామాయిల్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఇండోనేషియా ఎత్తివేయడం లాంటి కారణాలతో వంట నూనెల ధరలు కాస్త తగ్గాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. వంట నూనెల ధరల్ని మరింత తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరో వారం రోజుల్లో లీటర్‌పై రూ.10 ధర తగ్గించాలని, అన్ని బ్రాండ్లు ఒకే ధర మెయింటైన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం వంట నూనె తయారీ కంపెనీలను ఆదేశించింది. అంటే ఒకే బ్రాండ్ నూనె ధర ఒక్కో రాష్ట్రంలో ఒకలా కాకుండా దేశమంతా ఒకేలా ఉండబోతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. భారతదేశం తన వంట నూనె అవసరాల్లో 60 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గుతుండటంతో దేశీయంగా వంట నూనెల ధరలు తగ్గేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వంట నూనె తయారీ కంపెనీలు నెల రోజుల్లో లీటర్‌పై రూ.10 నుంచి రూ.15 వరకు తగ్గించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. బుధవారం ఫుడ్ సెక్రెటరీ సుధాన్షు పాండే ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్స్, వంట నూనె తయారీ కంపెనీలతో సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున ఆ లాభాన్ని వినియోగదారులకు అందించాలని, ఆయిల్ కంపెనీలు వంట నూనె ధరల్ని తగ్గించాలని ఆయన ఆదేశించారు. గత వారంలో అంతర్జాతీయంగా 10 శాతం ధరలు తగ్గాయని, అందుకే ధరలు తగ్గించాలని కోరామని ఆయన అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పామాయిల్, సోయా బీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ధర రూ.10 తగ్గించేందుకు ప్రధాన ఆయిల్ కంపెనీలు హామీ ఇచ్చాయి. కంపెనీలు మరో వారంలో వంట నూనెల ధరల్ని తగ్గించబోతున్నాయి. ధరలు తగ్గించడంతో పాటు దేశమంతా ఒకే ధర మెయింటైన్ చేయనున్నాయి. ప్రస్తుతం వేర్వేరు జోన్లలో ఒకే బ్రాండ్‌కు చెందిన ఒకే ఆయిల్ ధర రూ.3 నుంచి రూ.5 మధ్య తేడా ఉంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక ఈ సమావేశంలో మరో అంశం చర్చకు వచ్చింది. వంట నూనె తయారీ బ్రాండ్ల అన్యాయమైన వాణిజ్య పద్ధతుల అంశంపై చర్చ జరిగింది. 15 డిగ్రీల సెల్సియస్ దగ్గర వంట నూనె ప్యాక్ చేస్తున్నట్టు కంపెనీలు ప్యాకెట్‌పై రాస్తున్నాయి. ఈ టెంపరేచర్లో వంట నూనె బరువు పెరుగుతుంది. 30 డిగ్రీల సెల్సియస్ దగ్గర ప్యాక్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)