1. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ (Leave Encashment) ఆప్షన్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌తో రిటైర్మెంట్ సమయంలో అప్పటివరకు ఉపయోగించని లీవ్స్ని ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్నుకు సంబంధించిన లిమిట్ పెంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కోసం పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. అంటే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ద్వారా రూ.25 లక్షలు పొందినా ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇప్పటివరకు, ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు కేవలం రూ.3 లక్షలుగా ఉంది. ఇది 2002లో అత్యధిక మూలవేతనం నెలకు రూ.30,000 ఉన్నప్పుడు ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే రూ.3 లక్షల కన్నా ఎక్కువ మొత్తం లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ద్వారా లభిస్తే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT), ఒక ప్రకటనలో, సెక్షన్ 10(10AA)(ii) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయించబడిన మొత్తం రూ. 25 లక్షల పరిమితిని మించరాదని తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ యాజమాన్యాల నుంచి ప్రభుత్వేతర ఉద్యోగికి అటువంటి చెల్లింపులు ఏవైనా జరిగితే ఈ నియమం వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)