వీసా గోల్డ్ డెబిట్ కార్డ్, ప్లాటినమ్ మాస్టర్ కార్డ్, రూపే కార్డులపై ఏటీఎం విత్డ్రా పరిమితిని లక్ష రూపాయలకు పెంచుతున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. ఇంతకు ముందు ఈ కార్డుదారులు ఏటీఎంల నుంచి రూ.50వేలు మాత్రమే విత్డ్రా చేసుకునేవారు. కస్టమర్ల సౌకర్యార్థం త్వరలో డెబిట్ కార్డ్ లావాదేవీల పరిమితిని మరింత పెంచనున్నట్లు బ్యాంక్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
రూపే సెలెక్ట్ మరియు వీసా సిగ్నేచర్ వంటి కార్డ్ హోల్డర్లకు ATM నగదు యొక్క రోజువారీ ఉపసంహరణ సౌకర్యాన్ని రూ. 50,000 నుండి రూ. 1.5 లక్షలకు బ్యాంక్ పెంచింది. ఇది మాత్రమే కాదు, అటువంటి వినియోగదారులకు POS పరిమితి ఇప్పుడు రూ. 5 లక్షలుగా ఉంటుంది, ఇది గతంలో రూ. 1 లక్షా 25 వేలు మాత్రమే.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం, ఏటీఎంల నుంచి పీఎన్బీ ఖాతాదారుల రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితి రూ.25,000 కాగా, ఒకేసారి రూ.20,000 మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం పీఓఎస్ ద్వారా రూ.60,000 విత్డ్రా చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం కల్పిస్తున్నారు. నిర్దిష్ట కార్డులపై ఈ పరిమితి పెంచబడుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)