1. మాతృ దినోత్సవం సందర్భంగా రైల్వే శాఖ (Indian Railways) చిన్న పిల్లలు ఉన్న తల్లులకు తీపి కబురు అందించింది. రైళ్లలో ప్రయాణించే చిన్నారుల సౌకర్యార్థం స్పెషల్ గా బేబీ బెర్త్ (Baby Berth)లను రైల్వేశాఖ ప్రారంభించింది. ఈ బేబీ బెర్త్‌లు ఫోల్డబుల్ (Foldable)గా ఉంటాయి. ఇవి స్టాపర్లతో అందుబాటులోకి వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. రెగ్యులర్ బెర్త్‌కు పక్కనే ఉండే బేబీ బెర్త్‌లు చిన్న పిల్లలను పడుకోబెట్టేందుకు వీలుగా ఉంటాయి. బుజ్జాయిలను బెర్త్‌పై నుంచి కింద పడిపోకుండా సురక్షితంగా ఉంచడానికి బెర్త్‌లతో వచ్చే పట్టీల (Straps)ను ఉపయోగించవచ్చు. పసిపిల్లల కోసం ఉద్దేశించిన ఈ కొత్త బెర్త్‌లను కొన్ని రైళ్లలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. (image: Indian Railways)
4. కానీ భవిష్యత్తులో రిజర్వేషన్ టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలో తల్లులు తమ ఐదేళ్లలోపు పిల్లల పేరును తప్పనిసరిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మహిళలకు బేబీ బెర్త్ ఆఫర్ చేస్తారు. పిల్లల కోసం తీసుకొచ్చిన రెండు చిన్న సీట్లు లక్నో మెయిల్ (12230)లోని AC త్రీ-టైర్ కోచ్‌లోని 12, 60 రెగ్యులర్ బెర్త్‌లకు అటాచ్ చేశారు. (image: Indian Railways)
5. ఐఆర్టీఎస్ అధికారి సంజయ్ కుమార్ బేబీ బెర్త్‌లకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. "ఢిల్లీ డివిజన్ ఎంపిక చేసిన రైళ్లలో తల్లులు తమ బిడ్డలతో పాటు హాయిగా నిద్రించడానికి వీలుగా బేబీ బెర్త్‌ను ప్రారంభించింది. గౌరవనీయులైన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే సహాయ మంత్రి దర్శన జర్దోష్ నేతృత్వంలో ఇండియన్ రైల్వే తన సేవలను మరో స్థాయికి తీసుకువెళుతోంది." అని ట్విట్టర్లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇటీవల జరిగిన ఒక రైల్వే బోర్డు సమావేశంలో ఒక ఇంజనీర్ బేబీ బెర్త్‌ల గురించి మొదటగా మాట్లాడారు. మహారాష్ట్రకు చెందిన ఇంజనీర్ నితిన్ డియోర్, తల్లులు తమ పిల్లలతో పాటు ప్రయాణిస్తున్నప్పుడు వారికి సౌకర్యంగా ఒక ఫీచర్‌ను రూపొందించాలనే ఆలోచనను అందరి ముందుంచారు. ఈ ఆలోచనే ఇప్పుడు బేబీ బెర్త్ రూపంలో కార్యరూపం దాల్చింది. (image: Indian Railways)
7. ప్రయాణీకుల నుంచి సానుకూల స్పందన వస్తే, రైల్వే అన్ని రైళ్లలో బేబీ బెర్త్‌లను ఏర్పాటు చేస్తుందని ఒక రైల్వే అధికారి తెలిపారు. బేబీ బెర్త్‌తో అటాచ్ అయిన ఉన్న లోయర్ బెర్త్‌ను తల్లులు ఇతరుల నుంచి తీసుకోవచ్చు. ఈ సీట్ కేటాయించిన ప్రయాణికుడితో సీటు మార్పిడి చేసుకోవడానికి వారు ఆన్-బోర్డ్ రైలు టిక్కెట్ ఎగ్జామినర్‌ను సంప్రదించవచ్చని రైల్వే అధికారి తెలిపారు. (image: Indian Railways)