LIC Policy: ఎల్ఐసీ పాలసీ ఉందా? అయితే ఈ శుభవార్త మీకే
LIC Policy: ఎల్ఐసీ పాలసీ ఉందా? అయితే ఈ శుభవార్త మీకే
LIC IPO | ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్. త్వరలోనే ఎల్ఐసీ ఐపీఓ రానుందన్న సంగతి తెలిసిందే. ఈ ఐపీఓలో పాలసీహోల్డర్లకు కూడా ప్రత్యేకంగా వాటా లభించనుంది.
1/ 6
1. భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- LIC ఐపీఓ త్వరలో రానుంది. బీమా రంగంలో దిగ్గజమైన ఎల్ఐసీ ఐపీఓపై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. ఎల్ఐసీ ఐపీఓ కోసం ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. ఎల్ఐసీ ఐపీఓలో 10 శాతం వాటాలను ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్-DIPAM సెక్రెటరీ తుహిన్ కాంత పాండే ఈ విషయాన్ని వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేటాయించే షేర్లలో 10 శాతం షేర్లను ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు పొందొచ్చు. ఎల్ఐసీ ఐపీఓ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా రావొచ్చు. 2021 అక్టోబర్ తర్వాత ఐపీఓ వస్తుందని DIPAM తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. ఎల్ఐసీ ఐపీఓ తీసుకొస్తామని గత బడ్జెట్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఎల్ఐసీ ఐపీఓ గురించి ప్రస్తావించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. ఎల్ఐసీ ఐపీఓ ద్వారా రూ.90,000 కోట్లు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఐపీఓ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఐపీఓ కానుంది. ఎల్ఐసీ ఐపీఓ కోసం కేంద్ర ప్రభుత్వం డెలాయిట్, ఎస్బీఐ క్యాపిటల్ కంపెనీలను నియమించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. ప్రస్తుతం ఎల్ఐసీ వ్యాల్యుయేషన్ చూస్తే రూ.12 - రూ.15 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో ఆరు నుంచి ఏడు శాతం వాటాలు అమ్మడం ద్వారా రూ.90,000 కోట్లు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన. (ప్రతీకాత్మక చిత్రం)