1. భారతదేశంలోనే కాదు... ప్రపంచంలో అతిపెద్ద బీమారంగ సంస్థల్లో ఒకటైన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) రాబోతోంది. ఎల్ఐసీ ఐపీఓకు కౌంట్‌డౌన్ మొదలయినట్టే. మార్చి మొదటి వారంలోనే ఎల్ఐసీ ఐపీఓ మార్కెట్లోకి రానుందని ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. జంబో ఐపీఓగా చెప్పుకుంటున్న ఎల్ఐసీ ఐపీఓ మార్చి మొదటి వారంలో ప్రారంభం అవుతుందని ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు CNBC-TV18 తో చెప్పారు. మార్చి ప్రారంభంలో ఎల్ఐసీ ఐపీఓని తీసుకొచ్చేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (DIPAM) సెక్రెటరీ తుహిన్ కాంతా పాండే తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల్లో వాటాల అమ్మకాలను పర్యవేక్షించే విభాగంగా DIPAM పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ ఐపీఓ గురించి రెగ్యులేటరీ సంస్థలైన ఐఆర్డీఏ, సెబీతో సంప్రదింపులు జరిపినట్టు దీపం సెక్రెటరీ తుహిన్ కాంతా పాండే తెలిపారు. త్వరలోనే DRHP ఫైల్ చేయబోతున్నట్టు ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక 450 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఆస్తులను నిర్వహిస్తున్న ఎల్ఐసీ వాల్యుయేషన్‌ను చేసే పనిలో అధికారులు ఉన్నట్టు వివరించారు. ఎల్ఐసీ ఐపీఓలో రీటైల్ భాగస్వామ్యం సజావుగా సాగేలా చేయడానికి ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉందని తెలిపారు. ఎల్ఐసీ ఐపీఓ ద్వారా ప్రభుత్వం రూ.1,00,000 కోట్లు సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. గత నవంబర్‌లో పేటీఎం ఐపీఓ అతిపెద్దదిగా చెప్పుకున్నారు. పేటీఓ ఐపీఓ సైజ్ రూ.18,300 కోట్లు. ఈ లెక్కన చూసినా పేటీఎం ఐపీఓ కన్నా ఎల్ఐసీ ఐపీఓ ఐదు రెట్లు ఎక్కువ. అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ రికార్డు సృష్టించనుంది. ఇప్పటివరకు వచ్చిన ఐపీఓల్లో ఇదే అతి పెద్ధది కానుంది. ఇక 2021-22 మొదటి ఆరు నెలల్లో ఎల్ఐసీ రూ.1,437 కోట్ల నెట్ ప్రాఫిట్ నమోదు చేయడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎల్ఐసీ ఐపీఓలో పాలసీహోల్డర్లకు 10 శాతం కోటా లభించే అవకాశం ఉందని అంచనా. పాలసీహోల్డర్లు ఐపీఓ ధర కన్నా తక్కువకే షేర్లు కొనొచ్చు. మార్చి మొదటి వారంలో ఐపీఓ రానుంది కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరి ఎల్ఐసీ ఐపీఓ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. (ప్రతీకాత్మక చిత్రం)