1. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాలేకపోయారు. షికార్లు, టూర్లను పక్కన పెట్టేశారు. ఇప్పుడు ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారు. మరి మీరు కూడా సెలవుల్లో సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఓరోజు సరదాగా గడపాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గుడ్ న్యూస్ చెబుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఒకరోజు హైదరాబాద్ టూర్ ప్యాకేజీ (Hyderabad Tour Package) అందిస్తోంది. 'హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్' పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు కేవలం ఒక్క రోజులో హైదరాబాద్ చుట్టేయొచ్చు. సోమవారం, శుక్రవారం తప్ప ఇతర రోజుల్లో ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉదయం 8 గంటలకు ఐఆర్సీటీసీ సిబ్బంది పికప్ చేసుకుంటారు. ట్యాంక్ బండ్, బిర్లామందిర్, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీద్, చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్షాహీ టూంబ్స్ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇవన్నీ సందర్శించిన తర్వాత పర్యాటకుల్ని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పర్యాటకులు ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ లో టూర్ ప్యాకేజీ బుక్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.1,115 మాత్రమే. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.1665, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.3320 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. పర్యాటక స్థలాల్లో ఎంట్రెన్స్ ఫీజ్, అకామడేషన్, ఫుడ్ లాంటివి కవర్ కావు. (ప్రతీకాత్మక చిత్రం)