1. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ఉద్యోగులకు 4 శాతం డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంచిన సంగతి తెలిసిందే. ఇది 2022 జూలైకి సంబంధించిన డీఏ. ఇప్పుడు కొందరు ఉద్యోగులకు 15 శాతం డీఏ పెంచింది. అయితే 15 శాతం డీఏ అందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వం మొదట పెంచిన 4 శాతం డీఏ ఏడో పే కమిషన్ పరిధిలోని ఉద్యోగులకు వర్తిస్తుంది. అంటే ఏడో పే కమిషన్ పే స్కేల్లో ఉద్యోగాలు తీసుకుంటున్నవారికి 4 శాతం డీఏ పెరిగింది. ఇక తాజాగా పెంచిన 15 శాతం డీఏ ఐదో పే కమిషన్ కింద వేతనాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. దీంతో ఐదో పే కమిషన్ పరిధిలోని ఉద్యోగులకు ప్రస్తుతం 381 శాతంగా ఉన్న డీఏ 396 శాతానికి పెరిగింది. ఇక ఆరో పే కమిషన్ పరిధిలోని ఉద్యోగులకు డీఏ 9 శాతం పెరిగింది. వారికి 203 శాతం నుంచి 212 శాతానికి డీఏ పెరిగింది. బేసిక్ వేతనంపై డీఏ లెక్కించి ఇస్తారు. పెరిగిన డీఏ 2022 జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక సెప్టెంబర్ చివరి వారంలో ఏడో పే కమిషన్ ఉద్యోగులకు డీఏను 34 శాతం నుంచి 38 శాతం చేసిన సంగతి తెలిసిందే. వారికి కూడా 2022 జూలై 1 నుంచి పెరిగిన డీఏ అమలులోకి వచ్చింది. పెన్షనర్లకు కూడా డియర్నెస్ రిలీఫ్ 4 శాతం పెరిగింది. సాయుధ దళాల పెన్షనర్లు, రక్షణ సేవకు చెందిన సివిలియన్ పెన్షనర్లు, ఆల్ ఇండియా సర్వీస్ పెన్షనర్లు, రైల్వే పెన్షనర్లు, వారి కుటుంబ పెన్షనర్లు, తాత్కాలిక పెన్షన్ పొందుతున్న పెన్షనర్లకు ఈ పెన్షన్ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా జనవరిలో ఓసారి, జూలైలో మరోసారి డీఏ, డీఆర్ పెంచుతుంది. AICPI ఇండెక్స్ ద్వారా ఎంత శాతం డీఏ పెంచాలన్న నిర్ణయం తీసుకుంటుంది. ఇటీవల 2022 జూలైకి సంబంధించిన డీఏ, డీఆర్ పెరగడం 41.85 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల పెన్షనర్లకు మేలు చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రమోషన్‌కు అవసరమైన కనీస అర్హత సర్వీస్‌ని నిర్దేశించిన నిబంధనలను సవరించింది. ప్రమోషన్ కోసం అవసరమైన కనీస అర్హత సేవను సూచించే నిబంధనలను సవరించాలని నిర్ణయించినట్టు DoPT తెలిపింది. ఈ విధివిధానాలను అనుసరించిన తర్వాత రిక్రూట్మెంట్ రూల్స్, సర్వీస్ రూల్స్‌లో సవరణలను చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. సవరించిన నియమనిబంధనల ప్రకారం ఏడో పే కమిషన్ పే మ్యాట్రిక్స్‌లోని లెవెల్ 1, లెవెల్ 2 ఉద్యోగులకు ప్రమోషన్ కావాలంటే కనీసం మూడేళ్ల సర్వీస్ ఉండాలి. అలాగే లెవెల్ 6 నుంచి లెవెల్ 11 లోని ఉద్యోగులకు కనీసం 12 ఏళ్ల సర్వీస్ ఉండాలి. అయితే లెవెల్ 7, లెవెల్ 8 ఉద్యోగులకు ఇది రెండేళ్లు మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)