1. బంగారం ధరల ఊగిసలాట కొనసాగుతోంది. ఓరోజు పెరుగుతూ, మరో రోజు తగ్గుతూ బంగారం ధర పయనం కొనసాగుతోంది. ఈ వారంలో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. గోల్డ్ రేట్ ఓరోజు తగ్గుతోంది. మరోరోజు పెరుగుతోంది. బుధవారం పెరిగిన బంగారం ధర, గురువారం తగ్గింది. ధంతేరాస్కు 3 రోజుల ముందు బంగారం ధర తగ్గడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
2. గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.200 తగ్గి ధర రూ.46,550 నుంచి రూ.46,350 వరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.220 తగ్గడంతో ధర రూ.50,780 నుంచి రూ.50,560 వరకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గితే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర పెరిగింది. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.20 శాతం అంటే రూ.100 పెరిగి రూ.50,299 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.26 శాతం అంటే రూ.146 పెరిగి రూ.56,160 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చూస్తే ఔన్స్ బంగారం ధర 1,653 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 18.30 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. మరో మూడు రోజుల్లో ధంతేరాస్, వచ్చేవారం దీపావళి పర్వదినాలు ఉన్నాయి. ఈ పండుగ సీజన్లో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ధంతేరాస్, దీపావళి రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, అదృష్టం వరిస్తుందన్న విశ్వాసం ఉంది. కాబట్టి అప్పట్లోగా బంగారం, వెండి ధరలు మరింత పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. బులియన్ పరిశ్రమ సర్వే ప్రకారం, అధిక వడ్డీ రేట్లు ఉన్నా, వచ్చే ఏడాది బంగారం పుంజుకుంటుందని తేలింది. ఈ సర్వేలో ప్రపంచంలోని బడా వ్యాపారులు, రిఫైనర్లు, మైనర్లు పాల్గొన్నారు. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ వార్షిక సదస్సు కోసం లిస్బన్లో సమావేశమైన ప్రతినిధులు వచ్చే ఏడాది ఈ సమయానికి ఔన్సు ధర 1,830.50 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత స్థాయి కన్నా దాదాపు 10 శాతం ఎక్కువ. (ప్రతీకాత్మక చిత్రం)