1. కేంద్ర ప్రభుత్వం రైతులు వ్యవసాయం చేసేందుకు ఆర్థికంగా మద్దతు ఇచ్చేలా అనేక పథకాలను అందిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM KISAN Scheme) ద్వారా ఏటా రూ.6,000 పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా తక్కువ వడ్డీకే వ్యవసాయ రుణాలు (Agriculture Loan) ఇచ్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌ను (Kisan Credit Card) కేంద్ర ప్రభుత్వం 1998లో ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైతులకు స్వల్పకాలిక రుణాన్ని ఇవ్వడం కోసం రూపొందించిన పథకం ఇది. ఈ స్కీమ్ ద్వారా రైతులు కేవలం 4 శాతం వార్షిక వడ్డీకే వ్యవసాయ రుణాలు పొందొచ్చు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో పాటు పంటకోత తర్వాత ఖర్చుల కోసం రైతులకు రుణాలు ఇస్తాయి బ్యాంకులు. పాడి జంతువులు, పంపు సెట్లు మొదలైన వ్యవసాయ అవసరాలకు కూడా రుణాలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైతులు రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుంది. రుణం తీసుకున్న రైతులు మరణించినా, శాశ్వత వైకల్యానికి గురైనా రూ.50,000 వరకు బీమా కవరేజీ లభిస్తుంది. అర్హులైన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో పాటు స్మార్ట్ కార్డ్, డెబిట్ కార్డ్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైతులకు ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో రుణాలు లభిస్తాయి. ఈ రుణాలను ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం వాడుకోవచ్చు. రీపేమెంట్ కోసం రైతులకు అనుకూలమైన ఆప్షన్స్ ఉంటాయి. 3 సంవత్సరాల వరకు లోన్ చెల్లించవచ్చు. లేదా పంట కాలం ముగిసిన తర్వాత తిరిగి చెల్లించవచ్చు. రూ.1.60 లక్షల వరకు రుణాలకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. వడ్డీ రేట్ల విషయానికి వస్తే కనీసం 7 శాతం వార్షిక వడ్డీ నుంచి రుణాలు లభిస్తాయి. కిసాన్ క్రెడిట్ కార్డుపై వడ్డీ రేటు మినహాయింపు కూడా లభిస్తుంది. సకాలంలో రుణం చెల్లిస్తే 3 శాతం వరకు వడ్డీ మినహాయింపు పొందొచ్చు. అంటే రైతులు చెల్లించాల్సిన వడ్డీ 4 శాతం మాత్రమే. ఇంత తక్కువ వడ్డీ రేటుతో ఇతర ఏ రుణాలు లభించవు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23, 2023-24 సంవత్సరాలకు కూడా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద వడ్డీ రాయితీ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. వ్యవసాయ భూమి యజమాని లేదా సాగుదారు అయిన రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచచ్చు. వ్యక్తిగతంగా, జాయింట్‌గా, ఒక బృందంగా ఈ రుణాలు తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. మత్స్యకారులు, వ్యవసాయేతర కార్యకలాపాలు చేస్తున్నవారు, పశుపోషణ లాంటి అనుబంధ కార్యకలాపాలలో ఉన్న రైతులు కూడా అర్హులే. చేపల రైతులు, మత్స్యకారులు, స్వయం సహాయక బృందాలు, మహిళా సంఘాలు మత్స్య సంపదకు సంబంధించిన ఏదైనా కార్యకలాపాలు చేస్తున్నట్టైతే ఈ రుణాలు తీసుకోవచ్చు. రైతులు, పాడి రైతులు కూడా అర్హులే. (ప్రతీకాత్మక చిత్రం)