1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షన్ జమ చేసే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ నెలా ఆఖరి వర్కింగ్ డే రోజున పెన్షన్‌దారుల అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు ఈపీఎప్ఓ పెన్షన్ విభాగం ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ విశాల్ అగర్వాల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రస్తుతం ప్రతీ నెల 10వ తేదీ లోపు అంతకుముందు నెల పెన్షన్ జమ చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు ఏడో తేదీన, ఇంకొన్ని బ్యాంకులు పదో తేదీన పెన్షన్ జమ చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల మేరకు ప్రతీ నెల మొదటి వర్కింగ్ రోజున పెన్షన్ జమ చేయాలి. ఆ నెలలో ఐదో తేదీ లోపు పెన్షన్ జమ చేయాలన్న నిబంధనలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. నాలుగేళ్ల క్రితమే ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ బ్యాంకులకు సూచించింది. అయితే ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయాల నుంచి పెన్షన్ చెల్లింపులకు సంబంధించి బిల్లులు బ్యాంకులకు సకాలంలో అందకపోవడంతో పెన్షన్‌దారుల అకౌంట్లో డబ్బులు జమ చేయడంలో ఆలస్యం జరుగుతోంది. కొన్ని బ్యాంకుల్లో గడువు తేదీ దాటినా చెల్లింపులు జరగట్లేదని పెన్షన్‌దారులు ఈపీఎఫ్ఓ దృష్టికి తీసుకొచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. దీంతో ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టిపెట్టారు. ఇకపై ఏ నెల పెన్షన్ ఆ నెలాఖరులోగా జమచేయాల్సి ఉంటుందని ఆదేశించారు. ప్రతీ నెల చివరి రోజున పెన్షన్ జమ అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు సెలవు ఉంటే అంతకన్నాముందు రోజే పెన్షన్ జమ అవుతుంది. ఈ మేరకు పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులకు విధివిధానాలు జారీ చేయాలని సూచన విశాల్ అగర్వాల్ ఆదేశించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 80 లక్షల మంది పెన్షన్ దారులకు మేలు జరగనుంది. తాజా నిబంధనలతో వారికి ముందుగానే పెన్షన్ అకౌంట్లో జమ అవుతుంది. ఇక పెన్షన్ విషయంలో పెన్షన్‌దారులకు మేలు చేసేలా ఈపీఎఫ్ఓ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. కనీస పెన్షన్ పెంచే దిశగా ఆలోచిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 ద్వారా పెన్షన్‌దారులకు కనీస పెన్షన్ కేవలం రూ.1,000 మాత్రమే లభిస్తోంది. కనీస పెన్షన్‌ను పెంచాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. కనీస పెన్షన్ రూ.3,000 వరకు పెంచాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సు 2021 మార్చిలో చేసిన సంగతి తెలిసిందే. అయితే కనీస పెన్షన్ రూ.9,000 వరకు పెంచాలన్న డిమాండ్లు వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈపీఎఫ్ ఖాతాదారులకు కనీస పెన్షన్ పెంచాలన్న అంశంపై కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఫిబ్రవరిలో చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో కొత్త వేతన కోడ్ అంశంతో పాటు ఈపీఎస్ కింద కనీస పెన్షన్‌పైనా చర్చ జరగనుంది. దీంతో పాటు ఉద్యోగి రిటైర్మెంట్కు ముందు తీసుకున్న చివరి వేతనాన్ని బట్టి పెన్షన్ లెక్కించాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)