1. ఐదు కోట్లకు పైగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు అలర్ట్. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ భూపేందర్ యాదవ్ ఈపీఎఫ్ ఖాతాదారుల కోసం సరికొత్త ఇ-పాస్‌బుక్ (EPF e-passbook) సదుపాయాన్ని ప్రారంభించారు. ఇప్పటికే పాస్‌బుక్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ ఇంకా అడ్వాన్స్డ్గా ఇ-పాస్‌బుక్ అందుబాటులోకి రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇకపై ఈపీఎఫ్ ఖాతాదారులు వారి అకౌంట్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను గ్రాఫికల్‌గా ఇ-పాస్‌బుక్‌లో చూడొచ్చని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వెల్లడించింది. అంతేకాదు ఇ-పాస్‌బుక్‌లో మరిన్ని ఫీచర్స్ కూడా రాబోతున్నాయి. ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ పోర్టల్‌లో కొత్త ఇ-పాస్‌బుక్ డౌన్లోడ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక 2023 జనవరిలో కొత్తగా 14.86 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఈపీఎఫ్ఓలో చేరారు. ఇక 100 లేదా అంతకన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న 63 రీజనల్ ఆఫీసుల్లో క్రెచ్ సదుపాయాలను కూడా భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగిన 233వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈపీఎఫ్ఓ ద్వారా నిర్వహించబడే పథకాల కోసం 2022-23 సంవత్సరానికి సవరించిన అంచనాలను, 2023-24 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను బోర్డు ఆమోదించారు. అధిక పెన్షన్‌కు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా తీసుకున్న చర్యలు, ఆప్షన్ల దాఖలును సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలపై చర్చించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. వివిధ పరీక్షల నిర్వహణ కోసం ఈపీఎఫ్ఓ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదించింది. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ కేడర్లలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ద్వారా మొదటి నియామకాలు జరగనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును పెంచడం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలో 8.10 వడ్డీ ఇచ్చిన ఈపీఎఫ్ఓ, 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్స్ పెంచింది. ఈ నిర్ణయం 5 కోట్లకు పైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు మేలు చేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈపీఎఫ్ఓ గత ఆర్థిక సంవత్సరానికి అతి తక్కువగా 8.1 శాతం వడ్డీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ఇంకా తక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈసారి వడ్డీ రేటు దాదాపు 8 శాతానికి తగ్గిస్తారని భావించారు. కానీ ఈపీఎఫ్ఓ 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచడం విశేషం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తర్వాతే ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)