1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారికి అలర్ట్. ఈపీఎఫ్ ఖాతాదారులు తప్పనిసరిగా ఇ-నామినేషన్ ఫైల్ చేయాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండు రోజులుగా ఈపీఎఫ్ఓ వెబ్సైట్ సరిగ్గా పనిచేయట్లేదు. పదేపదే ఈపీఎఫఓ పోర్టల్ డౌన్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈపీఎఫ్ ఇ-నామినేషన్ ఫైల్ చేయడానికి 2021 డిసెంబర్ 31 చివరి తేదీ అని ప్రకటించడంతో ఈపీఎఫ్ ఖాతాదారులు గడువుకు ముందు నామినీ వివరాలు అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో సర్వర్‌పై లోడ్ పెరిగి ఈపీఎఫ్ఓ వెబ్సైట్ డౌన్ అవుతోంది. దీనిపై ఈపీఎఫ్ఓ స్పందించింది. 2021 డిసెంబర్ 31 ఇ-నామినేషన్ ఫైల్ చేయొచ్చని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈపీఎఫ్ ఖాతాదారులు 2021 డిసెంబర్ 31 తర్వాత కూడా ఇ-నామినేషన్ ఫైల్ చేసే అవకాశం ఉంది కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు. అయితే ఇ-నామినేషన్ ఫైల్ చేయడానికి ప్రస్తుతం ఎలాంటి డెడ్‌లైన్ విధించలేదని, పీఎఫ్, పెన్షన్, EDLI బెనిఫిట్స్ నామినీ పొందడం కోసం వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ కోరుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈపీఎఫ్ఓ 2022 ఫిబ్రవరి లోగా 100 శాతం ఇ-నామినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మనీకంట్రోల్ కథనాన్ని పబ్లిష్ చేసింది. అంతేకాదు... ప్రస్తుతం 40 శాతం ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు నామినీ వివరాలు అప్డేట్ చేయలేదని, పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయాలన్నా ఇ-నామినేషన్ తప్పనిసరికానుందని ఆ కథనం సారాంశం. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈపీఎఫ్ఓ నుంచి పీఎఫ్, పెన్షన్ బెనిఫిట్స్‌తో పాటు ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయని ఉద్యోగులకు తెలిసిందే. అయితే వాటిని నామినీకి అందించాలంటే నామినీ వివరాలు ఈపీఎఫ్ఓకు వెల్లడించడం తప్పనిసరి. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుంది. వారి మరణానంతరం నామినీలు కూడా పెన్షన్ పొందే సదుపాయం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. దీంతో పాటు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (EDLI) స్కీమ్ ద్వారా ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు రూ.7 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా నామినీకి లభించేవే. పీఎఫ్ అకౌంట్లో దాచుకున్న డబ్బులు, ప్రతీ నెలా లభించే పెన్షన్, ఈపీఎఫ్ ఖాతాదారులు మరణిస్తే వచ్చే ఇన్స్యూరెన్స్ లాంటివాటన్నింటికీ నామినీ వివరాలు కావాల్సిందే. అందుకే నామినీ వివరాలు అప్డేట్ చేయాలని కోరుతోంది ఈపీఎఫ్ఓ. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈపీఎఫ్ఓ మెంబర్స్ పోర్టల్‌లో ఈపీఎఫ్ ఖాతాదారులు తమ నామినీ వివరాలు యాడ్ చేయొచ్చు. లేదా అప్డేట్ చేయొచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డ్ హోల్డర్లు యూఏఎన్‌కు తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలి. దీంతో పాటు ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ యాక్టీవ్‌లో ఉండాలి. మరి ఈపీఎఫ్ఓ మెంబర్స్ పోర్టల్‌లో ఇ-నామినేషన్ ఎలా ఫైల్ చేయాలో అంటే నామినీ వివరాలు ఎలా యాడ్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఈపీఎఫ్ ఇ-నామినేషన్ ఫైల్ చేయడానికి ముందుగా https://www.epfindia.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Service ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అందులో For Employees ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత Member UAN/ Online Service (OCS/OTP) ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. ఆ తర్వాత Manage Tab పైన క్లిక్ చేయాలి. E-nomination ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఫ్యామిలీ డిక్లరేషన్ ఆప్షన్ దగ్గర Yes ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9. Add Family Details క్లిక్ చేసి అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి. నామినీగా ఒకరికన్నా ఎక్కువ మందిని యాడ్ చేయొచ్చు. ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో పర్సెంటేజ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Save EPF Nomination పైన క్లిక్ చేయాలి. తర్వాతి పేజీలో E-sign జనరేట్ చేయాలి. మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే నామినీ వివరాలు అప్డేట్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)