1. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వాయిస్ బేస్డ్ డిజిటల్ పేమెంట్ ఫెసిలిటీని ప్రారంభించింది. భారత్ గ్యాస్ కస్టమర్లు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ లాంటివి అవసరం లేకుండా జస్ట్ ఒక్క ఫోన్ కాల్‌తో గ్యాస్ సిలిండర్ బుక్ చేసి, పేమెంట్ కూడా పూర్తి చేయొచ్చు. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రారంభించిన UPI 123PAY సర్వీస్ ద్వారా ఇది సాధ్యం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. భారత్ గ్యాస్ వినియోగదారులకు UPI 123PAY ద్వారా పేమెంట్ సర్వీస్ అందించేందుకు అల్ట్రాక్యాష్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL). గ్రామీణ ప్రాంతాల్లోని 4 కోట్ల మంది వినియోగదారులు ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఫీచర్ ఫోన్ యూజర్లు కూడా డిజిటల్ పేమెంట్స్ ఉపయోగించడానికి ఆర్బీఐ UPI 123Pay సర్వీస్ లాంఛ్ చేసింది. ఈ ఫీచర్ వాడుకోవడం చాలా ఈజీ. కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఫీచర్ ఫోన్‌తో లింక్ చేయాలి. ఇందుకోసం డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేస్తే చాలు. రిజిస్టర్ చేసిన తర్వాత మిస్డ్ కాల్, యాప్, ఐవీఆర్, ప్రాక్సిమిటీ సౌండ్ బేస్డ్ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)