1. ఆంధ్రా ఊటీ అరకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త. అరకు వెళ్లే పర్యాటకులు అద్దాల రైలులో (Araku Glass Train) ప్రయాణించాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ అద్దాల రైలులో టికెట్లు బుక్ చేసుకునే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ టికెట్లు లభించవు. దీంతో నిరాశ చెందుతారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అరకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ మరో విస్టాడోమ్ కోచ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖపట్నం-కిరండూల్ రూట్లో ప్రయాణించే రైలుకు మరో అద్దాల బోగీ అందుబాటులోకి రానుంది. జనవరి 5 నుంచి ఫిబ్రవరి 25 వరకు విశాఖపట్నం-కిరండూల్ రైలులో అదనంగా అద్దాల బోగీ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైలు నెంబర్ 08551 విశాఖపట్నం నుంచి కిరండూల్ వెళ్లే రైలులో జనవరి 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, ఫిబ్రవరి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 తేదీల్లో అదనంగా అద్దాల బోగీ ఉంటుంది. ఇక రైలు నెంబర్ 08552 కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే రైలులో జనవరి 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, ఫిబ్రవరి 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో అదనంగా అద్దాల బోగీ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. అరకు వెళ్లే పర్యాటకులు ఈ అద్దాల బోగీలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే ఈస్ట్ కోస్ట్ రైల్వే 2023 జనవరి 22 వరకు ప్రతీ శనివారం, ఆదివారం అరకు స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. విశాఖపట్నం నుంచి అరకుకు రైలు నెంబర్ 08501 అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నంలో ఉదయం 8.30 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 11.30 గంటలకు అరకు చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. అద్దాల బోగీ ఎక్కాలనుకునేవారు మాత్రం 08551, 08552 నెంబర్ గల రైళ్లల్లో విస్టాడోమ్ కోచ్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలి. అద్దాల రైలులో అరకు అందాలు చూడొచ్చు. విస్టాడోమ్ ట్రైన్లో విశాఖపట్నం నుంచి అరకుకు రూ.735 ఛార్జీ ఉంటుంది. స్లీపర్ క్లాస్ ఛార్జీ రూ.145 కాగా, సెకండ్ సిట్టింగ్ ఛార్జీ రూ.75. ఇక ప్రత్యేక రైళ్లల్లో స్లీపర్ క్లాస్ ఛార్జీ రూ.235. (ప్రతీకాత్మక చిత్రం)