1. అంబాసిడర్ కార్... ఈ ఐకానిక్ కార్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం కొత్త అంబాసిడర్ కార్లు (Ambassador Cars) మార్కెట్లో లేవు. కానీ ఈ క్లాసిక్ ఇండియన్ కార్ సరికొత్త అవతారంలో త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. డిమాండ్ లేకపోవడం, అప్పుల కారణంగా అంబాసిడర్ కారును 2014లో నిలిపివేసింది హిందుస్తాన్ మోటార్స్ (Hindustan Motors). (ప్రతీకాత్మక చిత్రం)
2. దశాబ్దాల పాటు ఫోర్ వీలర్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న అంబాసిడర్ కారును హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్ కారును తీసుకురాబోతోంది. రెండేళ్లలో అంబాసిడర్ 2.0 మోడల్‌ను ఇండియాలో లాంఛ్ చేయబోతోంది. ఇప్పటికే అంబాసిడర్ 2.0 డిజైన్ ఓ దశకు వచ్చేసింది. రెండేళ్లలో ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. అంబాసిడర్ 2.0 మోడల్‌ను తీసుకొచ్చేందుకు హింద్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (HMFCI) ఫ్రెంచ్ కార్ మేకర్ అయినా పుజో (Peugeot) కంపెనీతో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు కలిసి అంబాసిడర్ 2.0 డిజైన్, ఇంజిన్‌పై పనిచేస్తున్నాయి. మళ్లీ భారతీయ రోడ్లపై అంతే స్థాయిలో హవా చూపించేలా ఈ కారును తయారు చేయబోతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. బ్రిటీష్ కార్ అయిన మోరీస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ III ఆధారంగా హిందుస్తాన్ మోటార్స్ 1957లో అంబాసిడర్ కారును లాంఛ్ చేసింది. ఈ ఐకానిక్ కారు స్టేటస్ సింబల్‌గా మారింది. దశాబ్దాలుగా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. అయితే 57 ఏళ్ల పాటు మార్కెట్లో అందుబాటులో ఉన్న కారు తయారీని 2014లో నిలిపివేసింది హిందుస్థాన్ మోటార్స్. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్లాంట్ మూసివేయడానికి ముందు పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌పరాలోని HM ఫ్యాక్టరీ నుంచి చివరి కారు మార్కెట్లోకి వచ్చింది. అంబాసిడర్‌కు డిమాండ్ తగ్గడంతో పాటు, సంస్థ భారీ అప్పుల్లో కూరుకుపోవడంతో ఈ కారు ప్రొడక్షన్ నిలిచిపోయింది. 2017లో హిందుస్థాన్ మోటార్స్ పుజోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రెంచ్ ఆటోమేకర్‌కు అంబాసిడర్‌ను విక్రయించింది. CK బిర్లా గ్రూప్ అంబాసిడర్ బ్రాండ్‌ను రూ.80 కోట్లకు విక్రయించింది. (ప్రతీకాత్మక చిత్రం)