1. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఎయిర్‌లైన్స్ సంస్థలు ఎయిర్పోర్ట్ చెకిన్ కౌంటర్ల దగ్గర బోర్డింగ్ పాసుల్ని (Boarding Pass) ఇచ్చేందుకు అదనంగా ఛార్జీలు వసూలు చేయకూడదని ఆదేశించింది. ప్రస్తుతం వెబ్ చెకిన్ చేయని ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌ల కోసం రూ.200 వసూలు చేస్తున్నాయి ఎయిర్‌లైన్స్ సంస్థలు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎయిర్పోర్ట్ కౌంటర్లలో చెక్-ఇన్ చేయాలనుకునే ప్రయాణికుల నుంచి బోర్డింగ్ పాస్‌ల కోసం ఎయిర్‌లైన్స్ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న విషయం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. అటువంటి అదనపు ఛార్జీలు తాజాగా విడుదల చేసిన ఆర్డర్లో లేదా ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937లోని ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇవ్వబడిన సూచనలకు అనుగుణంగా లేదని వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక ఎయిర్‌లైన్స్ వసూలు చేసే ఇతర ఛార్జీల వివరాలు చూస్తే ప్యాసింజర్ సర్వీస్ ఫీజ్, యూజర్ డెవలప్మెంట్ ఫీజ్, డెవలప్మెంట్ ఫీజ్, ఫ్యూయెల్ సర్‌ఛార్జీ లాంటి వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. ఇవన్నీ ఛార్జీలు ఫ్లైట్ టికెట్లో కలిపే ఉంటాయి. ఫ్లైట్ ఛార్జీ బ్రేకప్ చూస్తే ఈ ఛార్జీల వివరాలు గమనించవచ్చు. బేసిక్ ఫేర్‌కు అదనంగా ఈ ఛార్జీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)