1. ఈవారంలో బంగారం ధరల ఊగిసలాట కొనసాగుతోంది. బంగారం ధరలు ఓరోజు పెరుగుతున్నాయి. మరో రోజు తగ్గుతున్నాయి. బుధవారం పెరిగి, గురువారం తగ్గిన గోల్డ్ రేట్, ధంతేరాస్‌కు 2 రోజుల ముందు, శుక్రవారం కూడా తగ్గడం పసిడిప్రేమికులకు శుభవార్తే. హైదరాబాద్‌లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు తగ్గాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గిన సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.100 తగ్గి ధర రూ.46,350 నుంచి రూ.46,250 వరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.110 తగ్గడంతో ధర రూ.50,560 నుంచి రూ.50,450 వరకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. దేశీయ మార్కెట్లోనే కాదు, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.49 శాతం అంటే రూ.246 తగ్గి రూ.49,897 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ రేట్ రూ.50,000 దిగువకు చేరింది. ఇక సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.84 శాతం అంటే రూ.476 తగ్గి రూ.56,177 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చూస్తే ఔన్స్ బంగారం ధర 1,629 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 18.62 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం ధరలు తగ్గుతున్నా వచ్చే ఏడాది ఇదే సమయానికి బంగారం ధర 10 శాతం కన్నా పైనే పెరుగుతుందని బులియన్ పరిశ్రమ సర్వేలో తేలింది. ఔన్సు బంగారం ధర 1,830.50 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చూస్తే మరో రెండు రోజుల్లో ధంతేరాస్, వచ్చేవారం దీపావళి పండుగలు ఉన్నాయి. ఈ రెండు రోజుల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల కొనుగేళ్లు ఎక్కువగా ఉంటాయి. మరి రెండు రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అని కొనుగోలుదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)