Good income for cargo services: అక్కడ కార్గోకు కోటిన్నర ఆదాయం.. నష్టాల నుంచి లాభాల వైపు పయనిస్తున్న ఆ ఆర్టీసీ రీజియన్.. ఎక్కడంటే..

TSRTC: కరోనా కాలంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజియన్ లో కొత్త ఆలోచనతో కార్గో సర్వీసులు మొదలు పెట్టింది. దీంతో కార్గో సర్వీస్ కు మంచి ఆదాయం వచ్చింది. పది నెలల్లో కోటిన్నర ఆదాయంతో ఘనత సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గత ఏడాది జూన్ 19న కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అనతికాలంలోనే విస్తృతంగా పార్సిల్ కొరియర్ సేవలు అందిస్తూ రూ.1.50 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది.