1. స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్ 1 నుంచి దిగుమతి సుంకాన్ని పెంచబోతోంది. దీంతో పలురకాల వస్తువు ధరలు భారీగా పెరగున్నాయి. ధరలు పెరగబోయే వస్తువుల జాబితాలో ప్రైవేట్ జెట్ విమానాలు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, ఆభరణాలు, హై-గ్లోస్ పేపర్, విటమిన్లు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ధరలు తగ్గే వస్తువుల జాబితాలో కెమెరా లెన్స్‌లు, మొబైల్ ఫోన్లు, ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రాలు, లిథియం-అయాన్ బ్యాటరీల కోసం ఉపయోగించే యంత్రాలు, EV పరిశ్రమకు సంబంధించిన ముడి పదార్థాలు చౌకగా మారతాయి. మిథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాల ధరలు కూడా తగ్గుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. కేంద్రం గత బడ్జెట్లో అనేక వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచింది. కిచెన్ ఎలక్ట్రిక్ చిమ్నీపై కస్టమ్స్ సుంకం 7.5 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. వీటితో పాటు బంగారం, సిల్వర్ పాత్రలు, ప్లాటినం, సిగరెట్లు, నగలు, ఇంపోర్టెడ్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఆటవస్తువులు, బైస్కిల్స్, టీవీ, మొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎల్ఈడీ టీవీల ధరలు తగ్గడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశమే. (ప్రతీకాత్మక చిత్రం)
5. మరోవైపు సిగరెట్లు, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పరిహార సెస్ గరిష్ట రేటు లేదా పరిమితిని భారత ప్రభుత్వం నిర్ణయించింది. జీఎస్టీ పరిహార సెస్‌ను ఇతర వస్తువులతో పాటు రిటైల్ అమ్మకపు ధర సీలింగ్ రేటుకు అనుసంధానించింది. ఇటీవల ఆమోదం పొందిన ఆర్థిక బిల్లు 2023లో ప్రవేశపెట్టిన సవరణల్లో భాగంగా ఈ చర్య తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. కొత్త నిబంధనల ప్రకారం, పాన్ మసాలా ఉత్పత్తిపై ప్రస్తుతం విధించే 135 శాతం సుంకం స్థానంలో యూనిట్‌కు రిటైల్ విక్రయ ధరలో గరిష్టంగా 51 శాతం జీఎస్టీ పరిహార సెస్ ఉంటుంది. మరోవైపు పొగాకుపై సుంకం 1,000 స్టిక్‌లకు రూ.4170 + 290 శాతం ప్రకటన విలువ లేదా యూనిట్ రిటైల్ విక్రయ ధరలో 100 శాతం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)