22 Carats Gold Rate: సామాన్య ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే బంగారం ఇదే. ఎందుకంటే 22 క్యారట్ల బంగారంతోనే మహిళలు వాడే ఆభరణాలను తయారుచేస్తారు. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.48,550గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.550 పెరిగింది. ఒక్క గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ.4,855కి చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్టణం,విజయవాడతో పాటు దేశ రాజధాని న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో బంగారం ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.48,550కి పెరిగింది. ఇక చెన్నైలో రూ.48,970, పుణె, పాట్నాల్లో రూ.48,610, అహ్మదాబాద్‌లో రూ.48,600, జైపూర్, లక్నోల్లో రూ.48,700కి అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం, వెండి ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ప్రతి రోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)