వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు నేలచూపులు చూశాయి. జూలై 1న పసిడి రేటు పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 దిగివచ్చింది. దీంతో ఈ గోల్డ్ రేటు రూ. 50,890కు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం అయితే 10 గ్రాములకు రూ. 100 తగ్గుదలతో రూ. 46,650కు క్షీణించింది. బంగారం ధరలు తగ్గుతూ వస్తూ ఉంటే.. వెండి రేట్లు కూడా అదే రూట్ లో పయనించాయ్.