వరుసగా రెండో రోజు నేలచూపులు చూసిన బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో జూలై 2న పసిడి రేటు భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1310 పెరిగింది. దీంతో ఈ గోల్డ్ రేటు రూ. 52,200కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం అయితే 10 గ్రాములకు రూ. 1200 పెరుగుదలతో రూ. 47,850కు పెరిగింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి రేట్లు కూడా అదే రూట్ లో పయనించాయ్. కేజీ వెండి ధర ఏకంగా నాలుగు వందలు పెరిగి.. రూ.59,000కి చేరుకుంది.