ఇక అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే.. బంగారం ధర పెరిగింది. 0.54 శాతం పెరగుదలతో పసిడి రేటు ఈ వారాన్ని ఔన్స్‌కు 1755 డాలర్లతో ముగింపు పలికింది. అలాగే వెండి రేటు విషయానికి వస్తే.. 0.53 శాతం పైకి చేరింది. దీంతో సిల్వర్ రేటు ఔన్స్‌కు 21.48 డాలర్లకు ఎగసింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరల ప్రభావం దేశీ మార్కెట్లోని బులియన్ మార్కెట్‌పై కూడా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.