Gold Silver Price: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర, షాకిచ్చిన వెండి!
Gold Silver Price: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర, షాకిచ్చిన వెండి!
Gold Rate Today | బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. బంగారం ధర గత పది రోజుల కాలంలో చూస్తే.. నేల చూపులు చూస్తోంది. వెండి మాత్రం ఝలక్ ఇచ్చింది.
Gold Price Today | బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట. పసిడి రేటు దిగివచ్చింది. గత పది రోజుల కాలంలో చూస్తే బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. వెండి రేటు మాత్రం పైపైకి కదిలింది. దూసుకుపోయింది.
2/ 8
హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గాయి. గత పది రోజుల కాలంలో చూస్తే.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 150 మేర దిగి వచ్చింది. డిసెంబర్ 15న బంగారం ధర పది గ్రాములకు రూ. 54,530 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు పసిడి రేటు రూ. 54,380 వద్ద ఉంది.
3/ 8
అలాగే ఆర్నమెంటల్ గోల్డ్ అయిన 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు కూడా నేల చూపులు చూసింది. పది రోజుల కిందట ఈ బంగారం రేటు పది గ్రాములకు రూ. 49,990 వ్ద ఉంది. అయితే ఇప్పుడు ఈ పసిడి రేటు రూ. 49,850కు దిగి వచ్చింది.
4/ 8
గత పది రోజుల కాలంలో బంగారం ధరలు నాలుగు సార్లు తగ్గాయి. రెండు సార్లు స్థిరంగా కొనసాగాయి. మరో 4 రోజులు మాత్రం గోల్డ్ రేటు పైపైకి కదిలింది. ఇలా మొత్తంగా చూస్తే గత పది రోజుల్ల పసిడి రేటు తగ్గుదలలోనే ఉంది.
5/ 8
ఇక వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ ధర మాత్రం దూసుకుపోతోంది. గత పది రోజుల కాలంలో వెండి రేటు రూ. 1300 మేర పైకి కదిలింది. డిసెంబర్ 15న వెండి ధర కేజీకి రూ. 72,700 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు సిల్వర్ రేటు రూ. 74 వేల వద్ద కొనసాగుతోంది.
6/ 8
కాగా పైన పేర్కొన్న బంగారం ధరలకు జీఎస్టీ అదనం అని గుర్తించుకోవాలి. అలాగే బంగారు ఆభరణాల తయారీ చార్జీలు, జువెలర్స్ ప్రాఫిట్ మార్జిన్ వంటివి కూడా ఎక్స్ట్రాగా చెల్లించుకోవాలి. అందువల్ల వల్ల బంగారం ధరల్లో కొంత మేర వ్యత్యాసం ఉంటుంది.
7/ 8
ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే.. బంగారం ధరలు పెరిగాయి. మళ్లీ పసిడి రేటు 1800 డాలర్ల పైకి చేరింది. ప్రస్తుతం బంగారం ధర ఔన్స్‌కు 1806 డాలర్ల వద్ద ఉంది. అదేసమయంలో వెండి రేటును గమనిస్తే.. సిల్వర్ రేటు ఔన్స్‌కు 23.92 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
8/ 8
ఇకపోతే వచ్చే ఏడాదిలో బంగారం ధరలు భారీగా పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. వెండి ధర కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ఆర్థిక మాంద్యం భయాలు సహా భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వాటిని ఉదాహరణగా పేర్కొంటున్నారు.