Latest Gold Rates: పడిపోయిన బంగారం.. మళ్లీ పరుగులు పెట్టింది, నేటి రేట్లు ఇలా!
Latest Gold Rates: పడిపోయిన బంగారం.. మళ్లీ పరుగులు పెట్టింది, నేటి రేట్లు ఇలా!
Gold Rate Today | బంగారం ధరలు మోత మోగిస్తున్నాయి. పసిడి రేటు మళ్లీ పెరిగింది. నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పైకి చేరింది. దీంతో పసిడి ప్రేమికులపై ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు.
Gold Price Today | బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకని అనుకంటున్నారా? పసిడి రేటు పరుగులు పెడుతోంది. తగ్గినట్లే తగ్గి పైపైకి కదులుతోంది. దీంత బంగారం కొనుగోలుదారులపై ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు.
2/ 8
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెట్టడంతో దేశీ మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో కొత్త ఏడాది ఆరంభం నుంచే బంగారం దూకుడు కొనసాగిస్తోందని చెప్పుకోవచ్చు.
3/ 8
హైదరాబాద్‌లో జనవరి 7న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 మేర పైకి చేరింది. దీంతో ఈ బంగారం ధర రూ. 55,960కు చేరింది. నిన్న బంగారం ధర రూ. 430 మేర తగ్గిన విషయం తెలిసిందే.
4/ 8
అంటే బంగారం ధర నిన్న ఎంత తగ్గిందో నేడు అదే స్థాయిలో పైకి చేరిందని చెప్పుకోవచ్చు. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా ఇదే దారిలో నడిచింది. పది గ్రాములకు రూ. 400 పెరిగింది. రూ. 51,300కు చేరింది. నిన్న ఈ పసిడి రేటు రూ. 400 క్షీణించింది.
5/ 8
వెండి ధర కూడా తగ్గినట్లే తగ్గి జోరు చూపించింది. వెండి రేటు ఈ రోజు రూ. 900 పైకి చేరింది. దీంతో కేజీ వెండి దర రూ. 74,400కు చేరింది. సిల్వర్ రేటు గత రెండు రోజులు తగ్గింది. దాదాపు రూ. 2 వేలు పతనమైంది.
6/ 8
కాగా పైన పేర్కొన్న బంగారం ధరలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అదనం. అలాగే ఇంకా చార్జీలు అంటే బంగారు నగల తయారీ చార్జీలు కూడా ఎక్స్ట్రా. ఇంకా జువెలర్స్ ప్రాఫిట్ మార్జిన్ వంటివి కూడా కలుపుతారు. అందుకే బంగారం ధరల్లో కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు.
7/ 8
ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలను గమనిస్తే.. భారీగా పెరిగింది. 1.62 శాతం మేర పైకి చేరింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1870 డాలర్ల స్థాయికి ఎగసింది. ఇక వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ కూడా మెరిసింది. ఏకంగా 2.37 శాతం పైకి చేరింది. ఔన్స్‌కు 23.98 డాలర్లకు ఎగసింది.
8/ 8
కాగా ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 62 వేలకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల పసిడి రేటు తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయడం ఉత్తమం. ఇకపోతే వెండి ధర ఏకంగా రూ. 80 వేలకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి.