Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట.. దిగొచ్చిన ధరలు, షాకిచ్చిన వెండి!
Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట.. దిగొచ్చిన ధరలు, షాకిచ్చిన వెండి!
Gold Rate Today | గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధరలు నేడు పడిపోయాయి. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. వెండి రేటు మాత్రం ఝలక్ ఇచ్చింది.
Gold Silver Prices | బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బంగారం ధరలు దిగి వచ్చాయి. పసిడి రేటు పడిపోయింది. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు నేడు అడ్డు కట్ట పడింది. పసిడి ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.
2/ 10
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో ఆ ప్రభావం మన దేశీ మార్కెట్‌పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు బంగారం ధరలు రివర్స్ గేర్‌లోకి వచ్చాయని తెలిపారు.
3/ 10
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. మార్చి 15న పసిడి రేటు దిగి వచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధరను గమనిస్తే.. రూ. 110 తగ్గింది. దీంతో ఈ పసిడి రేటు పది గ్రాములకు రూ. 57,870కు పడిపోయింది.
4/ 10
ఇక 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు కూడా వెలవెలబోయింది. నేల చూపులు చూసింది. రూ. 100 మేర దిగి వచ్చింది. దీంతో ఈ బంగారం రేటు పది గ్రాములకు రూ. 53,050కు క్షీణించింది.
5/ 10
కాగా బంగారం ధరలు గత నాలుగు రోజుల్లో భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఏకంగా రూ. 2,400 మేర ర్యాలీ చేసింది. అయితే ఇలా ప్రతి రోజూ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు మాత్రం యూటర్న్ తీసుకున్నాయి.
6/ 10
నేడు బంగారం ధరలు దిగి వస్తే.. వెండి ధర మాత్రం పైపైకి కదిలింది. సిల్వర్ రేటు దూసుకుపోతోంది. వెండి రేటు భారీగా పెరింది. రూ. 500 మేర పైకి చేరింది. దీంతో వెండి ధర కేజీకి రూ. 72,500కు ఎగసింది.
7/ 10
బంగారం ధరలు తగ్గినా కూడా వెండి రేటు పరుగులు పెట్టడం గమనార్హం. వెండి ధర కూడా గత మూడు రోజులుగా పెరుగుతూనే వస్తోంది. ఈ కాలంలో సిల్వర్ రేటు రూ. 4,700 పైకి చేరింది. నేటి పెంపును పరిగణలోకి తీసుకుంటే వెండి ధర ఏకంగా రూ. 5 వేలకు పైగా పెరిగింది.
8/ 10
ఈ విధంగా బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులు పెరుగుతూ రావడం వల్ల పసిడి కొనుగోలు దారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు.
9/ 10
కాగా పైన పేర్కొన్న బంగారం ధరలకు జీఎస్టీ అదనం. అలాగే తయారీ చార్జీలు కూడా ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుకుంటే బంగారం ధరలు మరింత పైకి చేరుతాయని గుర్తించుకోవాలి. తయారీ చార్జీలు మీరు ఎంచుకునే జువెలరీ ప్రాతిపదికన మారతాయి.
10/ 10
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగి వచ్చాయి. వెండి కూడా పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 1 శాతం తగ్గుదలతో 1891 డాలర్లకు దిగి వచ్చింది. ఇక వెండి రేటు ఔన్స్‌కు 1.46 శాతం క్షీణతతో 21.71 డాలర్లకు దిగి వచ్చింది.