మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్లో అక్టోబర్ 10న సోమవారం రోజున బంగారం ధర భారీగా తగ్గింది. పసిడి రేటు పది గ్రాములకు రూ. 700కు పైగా పడిపోయింది. అంటే 1.3 శాతం క్షీణించింది. దీంతో బంగారం రేటు రూ. 51,330కు పడిపోయింది. గత మూడు నెలల్లో చూస్తే ఒకేసారి బంగారం ధర ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్లో పసిడి రేటు ఔన్స్‌కు 1.26 శాతం పడిపోయింది. దీంతో బంగారం రేటు ఔన్స్‌కు 1687 డాలర్లకు దిగి వచ్చింది. అలాగే వెండి రేటు కూడా 2.91 శాతం పతనమైంది. ఔన్స్‌కు 19.6 డాలర్ల వద్ద కదలాడుతోంది.