బంగారం ధరలు దిగిరావడంతో ఫిజికల్ గోల్డ్ డిమాండ్ పెరుగుతుందని, దీని వల్ల ధరలకు మద్దతు లభిస్తుందని వివరించారు. బంగారం కన్నా వెండి తక్కువ పనితీరు కనబర్చవచ్చని అంచనా వేశారు. బలహీనమైన పారిశ్రామిక డిమాండ్ ఇందుకు కారణంగా పేర్కొన్నారు. దీని వల్ల వెండి ఎక్కువగా పడిపోవడానికి అవకాశం ఉందన్నారు. బంగారం, వెండి కొనాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. అయితే మరికొంత మంది నిపుణులు పసిడి రేట్లు పెరగొచ్చని అంచనా వేస్తుండటం గమనార్హం.