GOLD SILVER PRICE TODAY GOLD PRICE INCREASED 4 TIMES IN JUST 5 DAYS CHECK TODAY RATES IN YOUR CITY SK
Gold Rate Today: షాకిస్తున్న బంగారం.. మళ్లీ భారీగా పెరుగుతోంది.. బాబోయ్.. ఏంటా ధరలు..
Gold Silver Price Today: బంగారం ధరల మోత మోగుతోంది. తాజాగా మరోసారి పసిడి ధర పెరిగింది. బంగారం రేటు ఎంత పెరిగింది? హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏయే నగరాల్లో ఎంత ధర ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులకు షాకిస్తూ..పైపైకి వెళ్తున్నాయి. వరుసగా మూడు రోజులు పెరిగిన పసిడి ధరలు.. ఆ తర్వాత ఒకరోజు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఎగబాకింది. బంగారంతో పాటు వెండి కూడా పెరిగింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
హైదరాబాద్‌లో 22 క్యారట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,150గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది. ఇక్కడ ఒక్క గ్రాము బంగారం ధర రూ.4,715కి చేరింది. ఇక కిలో గోల్డ్ కొనాలంటే మాత్రం రూ.47,15,000 పెట్టాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.51,430 పలుకుతోంది. నిన్నటితో పోల్చితే ఇది కూడా వంద రూపాయలు పెరిగింది. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రూ.5,143కి చేరింది. కిలో స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,43,000గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు,కేరళలో బంగారం ధరలు హైదరాబాద్‌లో ఎంతున్నాయో... దాదాపు అంతే ఉన్నాయి. 22 క్యారట్లతో పాటు 24 క్యారట్ల బంగారం ధరలు కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారట్ల గోల్డ్ (10 గ్రాములు) రూ.47,150, 24 క్యారట్ గోల్డ్ రూ.51,430గా ఉంది.. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
చెన్నైలో 22 క్యారట్ల బంగారం రేటు రూ.48,370కి చేరింది. పుణెలో రూ.47,250, అహ్మదాబాద్‌లో రూ.47,200, జైపూర్‌లో రూ.47,300, లక్నోలో రూ.47,300, పాట్నాలో రూ.47,250, భువనేశ్వర్‌లో రూ.47,150, చండీగఢ్‌లో రూ.47,300గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
చెన్నైలో 24 క్యారట్ల బంగారం రేటు రూ.52,760కి పెరిగింది. పుణెలో రూ.51,480, అహ్మదాబాద్‌లో రూ.51,500, జైపూర్‌లో రూ.51,580, లక్నోలో రూ.51,580, పాట్నాలో రూ.51,480, భువనేశ్వర్‌లో రూ.51,430, చండీగఢ్‌లో రూ.51,580కి చేరింది. . (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
Silver Rates: బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.66,500గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.600 పెరిగింది. తుల వెండి రేటు రూ.665కి చేరింది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్టణంలో వెండి ధరలు ఒకేలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
హైదరాబాద్‌తో పోల్చితే ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్, జైపూర్, లక్నోలో వెండి రేటు తక్కువగా ఉంటుంది. ఈ నగరాల్లో తులం వెండి ధర రూ.621గా ఉంది. కిలో ధర రూ.62,100 పలుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
గత కొన్ని రోజులుగా మళ్లీ బంగారం ధరల మోత మోగుతోంది. గడిచిన 10 రోజుల్లో పసిడి ధరలు ఐదుసార్లు పెరిగాయి. కేవలం రెండు సార్లు మాత్రమే తగ్గాయి. వెండిది కూడా అదే పరిస్థితి. గత 10 రోజుల్లో వెండి ధరలు కూడా ఐదు సార్లు పెరిగాయి. రెండు సార్లు తగ్గాయి. (ప్రతీకాత్మక చిత్రం)