Silver Rates Today: బంగారంధర పెరిగితే.. వెండి మాత్రం తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,100కి చేరింది. నిన్నటితో పోల్చితే రూ.400 తగ్గింది. తులం వెండి రూ.661కి లభిస్తోంది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, కేరళ, విజయవాడ, విశాఖపట్టణంలో వెండి ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రతి రోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)