ఇవాళ బంగారం, వెండి కొనాలనుకునేవారికి స్వల్ప ఊరట. పసిడి ధర కాస్త తగ్గింది. 24 క్యారెట్లు, 22 క్యారెట్ల రెండూ పడిపోయింది. వెండి ధర కూడా దిగొచ్చింది.
2/ 9
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు కొద్దిగాపెరిగినప్పటికీ, అందుకు భిన్నంగా భారత్ లోని ఆ రెండిటి ధరలు తగ్గడం గమనార్హం.
3/ 9
మంగళవారం నాడు 22 క్యారెట్ల బంగారం ఒక తులానికి(10 గ్రాములకు) రూ.280 తగ్గింది. అంటే, తులం 22 క్యారెట్ల బంగారం రూ.48,440 నుంచి రూ.48,160కి చేరింది. నగరాలను బట్టి రేట్లు వేర్వేరుగా ఉంటాయి.
4/ 9
24 క్యారెట్ల బంగారం ధర ఇవాళ ఒక తులానికి రూ.190 తగ్గింది. నిన్న తులం రూ.52,840 కాగా, ఇవాళ రూ.52,650గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా నగరాలను బట్టి మారుతుంది.
5/ 9
వెండి ధర ఒక తులానికి రూ.7 తగ్గి రూ.727గా కొనసాగుతోంది. ప్లాటినం ధర కూడా తులంపై రూ.150 తగ్గి రూ.24,380గా ఉంది. వీటి ధరలు కూడా ఆయా నగరాలను బట్టి మారుతుంటాయి.
6/ 9
మార్కెట్లో మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 తగ్గి, రూ. 52,310కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ. 47,950కు దిగొచ్చింది.
7/ 9
హైదరాబాద్ లో వెండి దర రూ.7 తగ్గి, తులం రూ.727గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నంలోనూ ధరలు ఇలానే ఉన్నాయి.
8/ 9
చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.48,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,650గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310 గా ఉంది.
9/ 9
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్స్‌కు 0.04 శాతం పెరుగుదలతో 1922 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.03 శాతం పెరుగుదలతో 25.04 డాలర్లకు చేరింది.