GOLD SILVER PRICE 28TH MARCH 2022 GOLD AND SILVER PRICES ALMOST UNCHANGED TODAY MKS
Gold Silver Price Today: నేడు (మార్చి 28) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? ఏ ఊళ్లో రేటు తక్కువ?
Gold Silver Price 28th March 2022: ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కచ్చితమైన రక్షణగా నిలిచేది ఒక్క బంగారం మాత్రమే. కాబట్టే ఏళ్లుగా బంగారాన్ని ప్రధానమైన పెట్టుబడిగా భావిస్తారు. మరి ఇవాళ(28 మార్చి, 2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశీ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితుల కారణంగా కొంతకాలంగా ఇండియాలో ప్రతిరోజూ బంగారం, వెండి ధరలు మారుతూ వస్తున్నాయి. కానీ సోమవారం నాటికి వరుసగా రెండో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ వెండి ధర కొన్ని నగరాల్లో స్వల్పంగా తగ్గింది.
2/ 9
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా తగ్గి, వెండి ధర కాస్త పెరిగినప్పటికీ భారత మార్కెట్లలో మాత్రం ఇవాళ పసిడి ధరల్లో మార్పులు రాలేదు. వరుసగా రెండో రోజూ ధరలు మారలేదు. వెండి ధర మాత్రమే తగ్గింది.
3/ 9
సోమవారం నాడు 22 క్యారెట్ల బంగారం ధర ఒక తులం(10 గ్రాములకు) రూ.48,200గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,590గా ఉంది. తులం వెండి ధర నిన్న రూ.734 ఉండగా, ఇవాళ రూ.689కు తగ్గింది. కానీ ఈ తగ్గుదల కొన్ని నగరాల్లోనే ఉంది.
4/ 9
మార్కెట్లో సోమవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 52,590 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200 వద్ద స్థిరంగా ఉంది.
5/ 9
ఇతర సిటీల్లో బంగారం ధరలు నిలకడగా ఉండి, వెండి రేటు తగ్గినా హైదరాబాద్ లో మాత్రం ఒక కిలో వెండి రూ. 73,400గా ఉంది. హైదరాబాద్ తోపాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.
6/ 9
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1955 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.03 శాతం పెరుగుదలతో 25.68 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్లో పసిడి నిలకడగా కొనసాగడం గమనార్హం.
7/ 9
వెండి ధర హైదరాబాద్ లో ఒక తులానికి రూ.734గా ఉండగా, ముంబైలో రూ.689, ఢిల్లీలో రూ.689, చెన్నైలో రూ.734, బెంగళూరులో రూ.734, నాగపూర్ లో రూ.689, సూరత్ లో రూ.689గా ఉంది. కొన్ని నగరాల్లోనే ధర రూ.689కి తగ్గగా, మిగతా చోట్ల ఆదివారం లాగే ధర రూ.734గా ఉంది.
8/ 9
22 క్యారెట్ల బంగారం ధర ఒక తులానికి హైదరాబాద్ లో రూ.48,200 కాగా, చెన్నైలో రూ.48,400, ముంబైలో రూ.48,200, కోల్ కతాలో రూ.48,200, పుణెలో రూ.48,300, జైపూర్, లక్నోలో రూ.48,350, కోయంబత్తూరులో రూ.48,440గా ఉంది. ఈ కేటగిరీ బంగారం ధరల్లో భారీ మార్పులు లేవు.
9/ 9
24 క్యారెట్ల బంగారం ధర ఒక తులానికి హైదరాబాద్ లో ధర రూ. 52,590 ఉంది. చెన్నైలో రూ.52,840, ముంబైలో రూ.52,590, ఢిల్లీలో రూ.52,590, అహ్మదాబాద్ లో రూ.52,670, జైపూర్, లక్నోలో రూ.52,740గా ఉంది.