22 carat gold rate in Hyderabad: సామాన్య ప్రజలు ఎక్కువగా ఈ బంగారాన్నే కొంటారు. ఎందుకంటే నగల తయారీలో దీనినే వినియోగిస్తారు. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.47,800 వద్ద స్థిరంగా ఉంది. రెండు రోజులుగా ధరలో మార్పులేదు. హైదరాబాద్ నగరంలో ఒక్క గ్రాము బంగారం ధర రూ.4,780 లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
24 carat gold rate in Hyderabad: ఇది స్వచ్ఛమైన బంగారం. పెట్టుబడులకు ఎక్కువగా వినియోగిస్తారు. హైదరాబాద్‌లో 24 క్యారట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.52,140 వద్ద స్థిరంగా ఉంది. దీని ధరలో కూడా రెండు రోజులుగా మార్పులేదు. హైదరాబాద్‌లో ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రేటు రూ.5,214కి పలుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత 10 రోజుల్లో బంగారం రేటు ఐదు సార్లు తగ్గింది. రెండు సార్లు పెరిగింది. మరో మూడు సార్లు స్థిరంగా ఉంది. బంగారం విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధర ఇక పెరగదు అని సంకేతం కనిపించినప్పుడు నగలు కొనుగోళ్లు చేయడం బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రతి రోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)