కాగా బంగారం ధరలు మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. గోల్డ్ రేటు రానున్న కాలంలో రూ. 65 వేలకు కూడా చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి రేటు అయితే ఏకంగా రూ. 80 వేలకు చేరొచ్చని పేర్కొంటున్నారు. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు ఈ విషయాన్ని గమనించాలి. పసిడి రేటు తగ్గినప్పుడు అల్లా కొనుగోలు చేయడం ఉత్తమం. లేదంటే బంగారం కొనడం కష్టమనే చెప్పుకోవాలి.