కొన్ని రోజులుగా సామాన్యుడికి అందకుండా పైపైకి ఎగబాకుతున్న బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలతో మన దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుతున్నాయి.
గురువారం రూ.497 తగ్గిన పసిడి ధర రూ. 39 వేల దిగువకు పడిపోయింది.
ఇవాళ ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.38,665 పలికింది.
వెండి ధర కూడా రూ.1,580 తగ్గింది. గురువారం కిలో వెండి ధర. రూ.47,235 పలికింది.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం కావొచ్చని ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో పెట్టుబడులు తగ్గిపోయాయి.
మన దేశంలో నగల వ్యాపారుల నుంచి కూడా డిమాండ్ కొంత తగ్గిపోవడంతో వెండి, బంగారం ధరలు దిగొస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వచ్చే నెలలో దసరా, దీపావళి పండుగలు ఉన్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
...