Gold Rates Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి.. ఇవాళ్టి రేట్ల వివరాలు
Gold Rates Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి.. ఇవాళ్టి రేట్ల వివరాలు
Gold and silver Rates Today: బడ్జెట్ తర్వాత బంగారం ధరలు దిగొస్తున్నాయి. ప్రతి రోజు భారీగా తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. మరి హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యనగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
బడ్జెట్ తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో పసిడి ధరలు దిగొస్తున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ బంగారం కూడా భారీగా ధరలు తగ్గాయి. మరి గురువారం (ఫిబ్రవరి 4న)న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
2/ 8
నేటి బంగారం ధరలు (04-02-2021): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.44,750 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.400 తగ్గింది. ఒక్క గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,475గా ఉంది.
3/ 8
24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ. 48,820 ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.440 తగ్గింది. ఒక్క గ్రాము మేలిమి బంగారం ధర రూ.4,882గా ఉంది.
4/ 8
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-44,750, విశాఖ-44,750 , విజయవాడ-44,750, ముంబై-48,000, చెన్నై-45,290, న్యూఢిల్లీ-46,900, బెంగళూరు-44,750, కోల్కతా-48,070
5/ 8
నిజానికి రెండో వారం నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. జనవరి 6న నగల బంగారం 22 క్యారెట్లది 10 గ్రాములు రూ.48,000 ఉంది. మరి ఇప్పుడో రూ.44,750 ఉంది. అంటే... ఆల్రెడీ రూ.3250 తగ్గింది. ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి.
6/ 8
నేటి వెండి ధరలు (04-02-2021): ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.73,200 ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర రూ.2,200 తగ్గింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.732గా ఉంది.
7/ 8
వెండి (10 గ్రాములు) ధరలు పలు నగరాల్లో ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ.732, విజయవాడ-732, విశాఖ-32, ముంబై-690, చెన్నై-753, న్యూఢిల్లీ-732, బెంగళూరు-722, కోల్కతా-రూ.690.
8/ 8
బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా తగ్గే సూచనలు ఉన్నాయి. అందుకే తగ్గినన్ని రోజులన్నీ చూస్తూ ఉండి.. ఇక పెరుగుతాయి అనే దశలో బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.