Gold Rates Today: భారీగా తగ్గిన బంగారం రేటు.. నగల కొనుగోలుకు ఇదే మంచి సమయమా?
Gold Rates Today: భారీగా తగ్గిన బంగారం రేటు.. నగల కొనుగోలుకు ఇదే మంచి సమయమా?
Gold and silver Rates Today: మన దేశంలో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. బడ్జెట్ తర్వాత తగ్గముఖం పట్టాయి. ఐతే నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు స్పల్పంగా తగ్గాయి. మరి హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యనగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
బడ్జెట్ తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో పసిడి ధరలు దిగొస్తున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి బుధవారం (ఫిబ్రవరి 3న)న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
2/ 8
నేటి బంగారం ధరలు (03-02-2021): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,150 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.35 తగ్గింది. ఒక్క గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,515గా ఉంది.
3/ 8
24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ. 49,260 ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.380 తగ్గింది. ఒక్క గ్రాము మేలిమి బంగారం ధర రూ.4,9826గా ఉంది.
4/ 8
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-45,150, విశాఖ-45,150 , విజయవాడ-45,150, ముంబై-47,590, చెన్నై-46,650, న్యూఢిల్లీ-47,300, బెంగళూరు-45,150, కోల్కతా-48,080.
5/ 8
నిజానికి జనవరి 6 నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. జనవరి 6న నగల బంగారం 22 క్యారెట్లది 10 గ్రాములు రూ.48,000 ఉంది. మరి ఇప్పుడో రూ.45,150 ఉంది. అంటే... ఆల్రెడీ రూ.2850 తగ్గింది. ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి.
6/ 8
నేటి వెండి ధరలు (03-02-2021): ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,000 ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర రూ.8,200 తగ్గింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.710గా ఉంది.
7/ 8
వెండి (10 గ్రాములు) ధరలు పలు నగరాల్లో ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ.710, విజయవాడ-710, విశాఖ-710, ముంబై-710, చెన్నై-753, న్యూఢిల్లీ-710, బెంగళూరు-710, కోల్కతా-రూ.710.
8/ 8
బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా తగ్గే సూచనలు ఉన్నాయి. అందుకే తగ్గినన్ని రోజులన్నీ చూస్తూ ఉండి.. ఇక పెరుగుతాయి అనే దశలో బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.