బంగారం ధరలు ప్రజలను ఊరిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. దీంతో ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి శుక్రవారం (జనవరి 29)న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధర తగ్గినప్పుడు కొంతమేర పుత్తడిని కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్తో పాటు వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అందుకే తగ్గినప్పుడే కొనడం బెటర్ అని అంటున్నారు.