Gold Rates Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్లో గోల్డ్ రేట్ల వివరాలు
Gold Rates Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్లో గోల్డ్ రేట్ల వివరాలు
Gold Rates Today: నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు స్పల్పంగా తగ్గాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యనగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
బంగారం ధరలు ప్రజలను ఊరిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. దీంతో ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ ఊహించలేని పరిస్థితి నెలకొంది. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ స్పల్పంగా తగ్గింది.
2/ 8
నేటి బంగారం ధరలు (15-01-2021): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,700 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.450 తగ్గింది.
3/ 8
24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ49,990 ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.500 తగ్గింది.
4/ 8
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-45,750, విశాఖ-45,750 , విజయవాడ-45,750, ముంబై-48,430, చెన్నై-46,600, న్యూఢిల్లీ-48,350, బెంగళూరు-45,750, కోల్కతా-48,410.
5/ 8
బంగారం ధరలు ఆగస్టు నుంచి తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 17న 22 క్యారెట్ల బంగారం (10 గ్రా.) ధర రూ.51,670గా ఉంటే.. ప్రస్తుతం రూ.45,750గా ఉంది. అంటే 5 నెలల్లో రూ.5000కి పైగా తగ్గింది పసిడి ధర. ఐతే డిసెంబరు 16 నుంచి మళ్లీ బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇటీవల మళ్లీ తగ్గుముఖం పట్టాయి.
6/ 8
నేటి వెండి ధరలు (15-1-2021): ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,300 ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర రూ.400 తగ్గింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.703 ఉంది.
7/ 8
వెండి (10 గ్రాములు) ధరలు పలు నగరాల్లో ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ.703, విజయవాడ-703, విశాఖ-703, ముంబై-660, చెన్నై-703, న్యూఢిల్లీ-660, బెంగళూరు-660, కోల్కతా-రూ.666.
8/ 8
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో ధర తగ్గినప్పుడు కొంతమేర పుత్తడిని కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.