Gold Rate Today | బంగారం కొనాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే పసిడి రేటు పరుగులు పెడుతోంది. తగ్గినట్లే తగ్గి కొండెక్కింది. గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన పసిడి రేటు ఇప్పుడు మరోసారి దూకుడు మీద ఉంది. పసిడి ప్రేమికులకు ఇది షాక్ అని చెప్పాలి.
2/ 8
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా డాలర్ బలహీన పడటంతో బంగారం ధర మెరిసిందని తెలియజేస్తున్నారు.
3/ 8
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. మార్చి 11న పసిడి రేటు పైపైకి కదిలింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 820 మేర ర్యాలీ చేసింది. దీంతో ఈ గోల్డ్ రేటు రూ. 56,890కు చేరింది.
4/ 8
అలాగే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు కూడా జిగేల్ మంటోంది. బంగారం ధర ఏకంగా రూ. 750 మేర పెరిగింది. దీంతో ఈ పసిడి రేటు పది గ్రాములకు రూ. 52,150 చేరింది. కాగా బంగారం ధరలు నిన్న కూడా రూ. 500కు పైగా పెరిగాయి.
5/ 8
వెండి ధర విషయానికి వస్తే.. సిల్వర్ రేటు కూడా ఇదే దారిలో పయనించింది. సిల్వర్ ధర ఏకంగా రూ. 1400 మేర పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర రూ. 68,700కు చేరింది. వెండి ప్రియులకు కూడా ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.
6/ 8
కాగా పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అదనం. అంతేకాకుండా తయారీ చార్జీలు కూడా ఉంటాయి. అందువల్ల వీటిని కలుపుకుంటే.. పసిడి రేటు మరింత పైకి చేరుతుందని చెప్పుకోవచ్చు.
7/ 8
మరో వైపు అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే.. బంగారం ధరలు భారీగా పెరిగాయి. కొండెక్కి కూర్చున్నాయి. పసిడి రేటు ఔన్స్‌కు ఏకంగా 2 శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఇటీవల కాలంలో బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే గమనార్హం. అమెరికా డాలర్ మూడు నెలల గరిష్ట స్థాయి నుంచి కిందకు పడిపోవడం ఇందుకు కారణం.
8/ 8
పసిడి రేటు ఔన్స్2కు 2.08 శాతం మేర ర్యాలీ చేసింది. దీంతో బంగారం రేటు 1872 డాలర్లకు ఎగసింది. అలాగే వెండి రేటు కూడా 2.18 శాతం పెరిగింది. దీంతో వెండి రేటు ఔన్స్‌కు 20.6 డాలర్లకు ఎగసింది. బంగారం కొనాలని భావించే వారికి ఇది షాక్ అనే చెప్పుకోవాలి. బంగారం ధరలు ఒక్కసారి ర్యాలీ చేస్తున్నాయి.