హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూనే వచ్చాయి. పసిడి రేటు రూ. 330 మేర దిగి వచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరకు ఇది వర్తిస్తుంది. దీంతో ఈ పసిడి రేటు ఇప్పుడు రూ. 55,960 వద్ద ఉంది. కాగా ఈ బంగారం ధర రూ. 56 వేలు దాటిపోయిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ వెనక్కి వచ్చింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే.. బంగారం ధరలు ఇంకా గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. పసిడి రేటు ఔన్స్‌కు 1880 డాలర్లకు పైనే కదలాడుతోంది. ఇక వెండి ధర అయితే ఔన్స్‌కు 23.56 డాలర్ల వద్ద ఉంది. అంటే గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పై స్థాయిల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అయితే దేశీ మార్కెట్లో మాత్రం కొంత మేర క్షీణించాయి. కాగా ఈ ఏడాదిలో బంగారం ధరలు రూ. 62 వేలకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి.