Gold Prices: రూ.1,300 పడిపోయిన బంగారం ధర.. రూ.3,600 పతనమైన వెండి! లేటెస్ట్ రేట్లు ఇలా
Gold Prices: రూ.1,300 పడిపోయిన బంగారం ధర.. రూ.3,600 పతనమైన వెండి! లేటెస్ట్ రేట్లు ఇలా
Gold Price Today | బంగారం కొనాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర భారీగా తగ్గింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.
Gold Rate Today | బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. గోల్డ్ రేటు భారీగా పడిపోయింది. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. దీంతో బంగారం, వెండి కొనే వారికి ఊరట కలుగుతోందని చెప్పుకోవచ్చు.
2/ 9
బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో భారీగా పడిపోయింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పసిడి రేటు దిగి వచ్చింది. ఏకంగా రూ. 1300కు పైగా పడిపోయింది. వెండి ధర అయితే ఏకంగా రూ. 3,600 కుప్పకూలింది.
3/ 9
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర రెండు రోజుల్లోనే రూ. 1300 పతనమైంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరకు ఇది వర్తిస్తుంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అయితే రూ. 1200 కుప్పకూలింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది.
4/ 9
ప్రస్తుతం ఫిబ్రవరి 5న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు ప్రస్తుతం పది గ్రాములకు రూ. 52,400 వద్ద ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాములకు రూ. 57,160 వద్ద ఉంది. రెండు రోజుల్లోనే పసిడి రేటు భారీగా తగ్గింది.
5/ 9
అలాగే వెండి ధర విషయానికి వస్తే.. సిల్వర్ రేటు భారీగా పడిపోయింది. రెండు రోజుల్లో రూ. 3,600 పతనమైంది. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కేజీకి రూ. 74,200 వద్ద ఉంది. వెండి కడియాలు, గజ్జలు కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం.
6/ 9
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు జీఎస్టీ అదనం. అంతేకాకుండా గోల్డ్ లేదా సిల్వర్ జువెలరీ కొనుగోలు చేయాలని భావించే వారు మరో విషయాన్ని గుర్తించుకోవాలి. తయారీ చార్జీలు కూడా ఉంటాయి. వీటిని కలుపుకుంటే రేట్లు ఇంకా పైకి కదులుతాయి.
7/ 9
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా డాలర్ మళ్లీ బలపడటంతో పసిడి రేటుపై ప్రతికూల ప్రభావం పడిందని తెలిపారు.
8/ 9
గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర వారం ఆరంభంలో ఏకంగా ఔన్స్‌కు 1900 డాలర్ల పైకి చేరింది. అయితే చివరకు వచ్చే సరికి గోల్డ్ రేటు 1900 డాలర్ల కిందకు పడిపోయింది. ఇప్పుడు బంగారం ధర 1877 డాలర్ల వద్ద ఉంది.
9/ 9
బంగారం ధర వచ్చే కాలంలో ఏకంగా రూ. 65 వేలకు చేరొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. అందువల్ల పసిడి రేటు తగ్గినప్పుడు అల్లా కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఇప్పుడు బంగారం కొనే వారికి మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.