GOLD RATES COMING DOWN ON THE FIRST DAY OF SHRAVAN MASAM IS A BIG RELIEF FOR WOMEN AK
Gold Rates: శ్రావణమాసం వేళ మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
Gold Rates: బంగారం ధరలు తగ్గడం పెరగడం అనేది అంతర్జాతీయ మార్కెట్లు, పరిణామాల మీద ఆధారపడి ఉండే అంశమే అయినా.. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం వేళ ధరలు దిగిరావడం విశేషం.
సాధారణంగా పెళ్లళ్ల సీజన్, పండగల సీజన్ మొదలైన తరువాత బంగారం ధరలు పెరుగుతుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. శ్రావణమాసం మొదలైన వేళ బంగారం ధరలు మరింతగా తగ్గుముఖం పడుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
కొద్దిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. ఇవాళ కూడా కిందకు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,830 నుంచి రూ.530 పడిపోయి రూ.47,300కు చేరుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర ₹43,840 నుంచి 490 రూపాయలు క్షీణించి ₹43,350 చేరుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
మరోవైపు బంగారం తరహాలోనే వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. కేజీ వెండి ధర రూ.66,990 నుంచి రూ.64,025 చేరుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
బంగారం ధరలు తగ్గడం పెరగడం అనేది అంతర్జాతీయ మార్కెట్లు, పరిణామాల మీద ఆధారపడి ఉండే అంశమే అయినా.. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం వేళ ధరలు దిగిరావడం ఊరట కలిగించే విషయం.(ప్రతీకాత్మక చిత్రం)