కాగా రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పైకి కదిలే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై బేస్ ఇంపోర్ట్ డ్యూటీని పెంచడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. పసిడిపై ఇప్పుడు సుంకం పది గ్రాములకు 565 డాలర్ల నుంచి 582 డాలర్లకు చేరింది. వెండిపై అయితే కేజీకి 699 డాలర్ల నుంచి 771 డాలర్లకు ఎగసింది.