మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే.. పసిడి రేటు వెలవెలబోతోంది. బంగారం ధరలు దిగి వచ్చాయి. ఈ రోజు బంగారం ధర పడిపోయింది. ఔన్స్‌కు 1817 డాలర్ల వద్ద కదలాడుతోంది. డాలర్ పుంజుకోవడంతో పసిడిపై ప్రతికూల ప్రభావం పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. వెండి కూడా దిగి వచ్చింది. సిల్వర్ రేటు ఔన్స్‌కు 20 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో దేశీ మార్కెట్లో రేట్లు తగ్గాయని చెప్పుకోవచ్చు.