GOLD RATE TODAY HERE IS LATEST PRICE LIST OF GOLD AND SILVER CHECK THE LATEST RATE IN YOUR CITY SK
Gold Rates Today: దూసుకెళ్తున్న బంగారం రేటు.. మళ్లీ పెరిగింది.. తాజా ధరల వివరాలు
Gold Price Today: బులియన్ మార్కెట్లో బంగారం దూకుడు కొనసాగుతోంది. అప్పుడప్పుడూ కాస్త తగ్గినా.. ఎక్కువ రోజులు మాత్రం పెరుగుతూనే ఉంది. వెండిది కూడా అదే పరిస్థితి. మరి బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి? ఏయే నగరాల్లో ఎంత పలుకుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
Gold rate Today: నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 44,550గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,455గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
పెట్టుబడులు వినియోగించే 24 క్యారెట్ల బంగారం కూడా పెరిగింది. హైదారబాద్‌లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,490గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.110 పెరిగింది. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రూ.4,860కి అందుబాటులో ఉంది. (ఫ్రతీకాత్మక చిత్రం)
దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరల వివరాలు: చెన్నైలో 48,920, ముంబైలో 47,470, న్యూఢిల్లీలో 50,950, కోల్‌కతాలో 49,600, బెంగళూరులో రూ.48,600, కేరళలో 48,600.
5/ 8
పెళ్లిళ్లు, పండగ సీజన్ కావడంతో కొన్ని రోజులుగా బంగారం ధరల మోత మోగుతోంది. గడిచిన 10 రోజుల్లో బంగారం ధరలు ఆరుసార్లు పెరిగాయి. రెండు సార్లు తగ్గాయి. మరో రెండు సార్లు స్థిరంగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
silver Rates today: బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో తులం వెండి ధర రూ.702గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.15 పెరిగింది. కిలో బంగారం రూ.68,700కి లభిస్తోంది. అదే ఒక్క గ్రాము గోల్డ్ రూ.70.20గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
దేశవ్యాప్తంగా వెండి ధరల వివరాలు: హైదరాబాద్, చెన్నై, కేరళలో 10 గ్రాముల వెండి రూ.702 పలుకుతోంది. ఇక ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, లక్నోలో రూ.655గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
బంగారం, వెండి ధర ఎప్పుడు ఒకేలా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుదల, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో డిమాండ్ వంటి కారణాలతో నిత్యం మారుతుంటాయి. (ప్రతీకాత్మక చిత్రంర)